¡Sorpréndeme!

MS Dhoni Heroics vs LSG | IPL 2025 లో లక్నోపై విరుచుకుపడిన మహేంద్ర సింగ్ ధోనీ

2025-04-15 0 Dailymotion

వరుసగా ఐదు ఓటములు..లీగ్ లో నిలవాలంటే ఈ రోజు గెలవాల్సిందే. అప్పటికే 15ఓవర్లు ముగిసిపోయాయి. విజయానికి మిగిలిన ఐదు ఓవర్లలో 55 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న చెన్నై ఆఖరి బ్యాటర్ దూబే వేగంగా ఆడలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మైదానంలోకి అడుగుపెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ. దూబే కి తన మీద తనకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలో అదే చేశాడు. 43ఏళ్ల వయస్సులో తన శరీరం పూర్తిగా సహకరించకున్నా టీమ్ ను నిలబెట్టాలని గట్టిగా సంకల్పించుకున్నట్లున్నాడు. ఆడిన 11 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్ తో 26 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 236. నిన్నటి మ్యాచులో ధోనీ సాగించిన విధ్వంసం ఇది. లక్నో ఇంకా చెన్నై రెండు జట్లలోనూ ఈ స్ట్రైక్ రేట్ తో ఎవ్వరూ బ్యాటింగ్ చేయలేకపోయారు. బౌలర్లు సహకరిస్తున్న బౌలింగ్ పిచ్ పై తన బలాన్నంతా నమ్ముకుని దొరికిన బంతిని దొరికినట్లు బాది పారేశాడు. సింగిల్ హ్యాండ్ తో సిక్స్ కొట్టాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కసి మీదున్నాడో ధోనీ నిన్న. ఆ వయస్సులో ధోనినే అలా ఆడితే ఇక దూబే ఎలా ఆడాలి. అందుకే చివర్లో రెచ్చిపోయాడు దూబే. టీమ్ కి కావాల్సిన మిగిలిన పరుగులను భారీ షాట్లతో పూర్తి చేసేశాడు. ధోనీని గ్రేటెస్ట్ అని ఎందుకు అంటారో నిన్నటి ఇన్నింగ్స్ తర్వాత అందరికీ పరిచయం అయ్యి ఉంటుంది. అంతెందుకు దానికి ముందు లక్నో బ్యాటింగ్ టైమ్ లో తన వరల్డ్స్ బెస్ట్ వికెట్ కీపర్ ను బయటకు తీశాడు. ఓ స్టంప్ అవుట్, ఓ రన్ అవుట్, ఓ క్యాచ్ వికెట్ కీపర్ గా అవుట్ చేయాల్సిన అన్ని విధాలుగా నిన్న సత్ఫలితాలను సాధించాడు ధోని. జడేజా బౌలింగ్ లో ఆయుష్ బడోనీ ని స్టంప్ అవుట్ చేయటం ద్వారా ఐపీఎల్ లో 200 డిస్మిసల్స్ చేసిన తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు ధోనీ. అలా అటు ఫినిషింగ్ లోనూ ఇటు కీపింగ్ లోనూ అటు కెప్టెన్సీలోనూ అన్ని రకాలుగా దుమ్మురేపిన తలా ధోని చెన్నైకి రెండో విజయాన్ని అందించి లీగ్ లో నిలబెట్టాడు.